దర్శకురాలు జయ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి.. బిఏ రాజుకు పరామర్శ

  • జయ మృతి జీర్ణించుకోలేని విషయం
  • చిత్రపరిశ్రమకు తీరనిలోటు
  • బిఏ రాజు నాకు చిరకాల మిత్రుడు
దర్శకురాలు, ఫిల్మ్ జర్నలిస్ట్ బి.జయ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జయ భర్త, పీఆర్వో బిఏ రాజును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. అనంతరం, మీడియాతో  చిరంజీవి మాట్లాడుతూ, జయ తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని, ఆమె మృతి వార్త తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ వార్త నిజమో కాదో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఈ విషాద వార్త నిజమేనని తెలిసిందని అన్నారు.

జయ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చిత్రపరిశ్రమకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. బిఏ రాజు తనకు చిరకాల మిత్రుడని, చెన్నైలో ఉన్నప్పటి నుంచి వీళ్లిద్దరితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చిరంజీవి చెప్పారు.
Go Back to Shorts
Chiranjeevi
director jaya
ba raju

More Telugu News