ఫేస్‌బుక్‌లో డబ్బున్న అమ్మాయిలకు ఎర.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్.. బెదిరింపులు!

31-08-2018 Fri 07:45 | Telangana
  • తొలుత అమ్మాయిలతో చాటింగ్
  • ఆపై ఫొటోలు సేకరించి మార్ఫింగ్
  • తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బుల డిమాండ్
ఆ యువకుడి పేరు మలిపెద్ది విద్యాసాగర్ రెడ్డి (28). యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని బూజిలాపురం. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్సార్‌నగర్‌లో ఉండే విద్యాసాగర్‌కు ఫేస్‌బుక్‌లో చాటింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎందుకంటే.. డబ్బున్న అమ్మాయిలకు వలవేసి డబ్బులు గుంజేందుకు. పాపం పండడంతో పోలీసులకు చిక్కి ఇప్పుడు తీరిగ్గా కటకటాలలో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు.

ప్రైవేటు ఉద్యోగం వల్ల వస్తున్న జీతం సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని విద్యాసాగర్ ప్లాన్ వేశాడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. వారికి మాయమాటలు చెప్పి వారి ఫొటోలు, వివరాలు సేకరించేవాడు. ఆ తర్వాత తన అసలు రూపాన్ని ప్రదర్శించేవాడు. అమ్మాయిల నుంచి ఫొటోలు సేకరించిన నిందితుడు వాటిని మార్ఫింగ్ చేసి, బాధిత అమ్మాయిలకు పంపి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు.

ఈ నెల 19న  నిజాంపేట బృందావన్‌కాలనీకి చెందిన ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. దర్యాప్తులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు ఐదుగురు అమ్మాయిలు, వారి స్నేహితులతో పరిచయం పెంచుకుని నిత్యం చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో నిజాంపేట యువతి పరిచయం అయింది. ఆమె కుటుంబ వివరాలు, ఆస్తి, ఇతర విషయాలు సేకరించాడు.

అనంతరం ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. తన దగ్గర యువతి అసభ్య చిత్రాలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అంతేకాదు, ముంబైలో ఉంటున్న ఆమె వద్దకు వెళ్లి, అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. విద్యాసాగర్ మరో యువతితో చాటింగ్ చేస్తున్నాడని గమనించిన పోలీసులు ఆమె సాయంతో.. సుజనా ఫోరం మాల్‌కు రప్పించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు.
Facebookchattingphoto morphingHyderabadTelangana

More Telugu News

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27
..more