కమల్ సొంత బ్యానర్లో విక్రమ్ .. ఆయన జోడీగా అక్షరహాసన్

కమలహాసన్ గొప్ప నటుడు .. దర్శకుడు మాత్రమే కాదు .. భారీ చిత్రాల నిర్మాత కూడా. ఆయన సొంత బ్యానర్ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్లో గతంలో ఎన్నో చిత్రాలు రూపొందాయి. ఆ సినిమాలు చాలావరకూ ఘన విజయాలను అందుకున్నాయి. అలాంటి కమల్ తాజాగా ఒక భారీ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.

పూజా కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆ సినిమాను ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అక్షర హాసన్ చేయనుంది. మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.         
Go Back to Shorts
vikram
akshara hassan

More Telugu News