harikrishna: ఆ విషయాన్ని ఒక్క హరికృష్ణ గారే గుర్తించగలిగారు!: ‘శివరామరాజు’ నటుడు వెంకట్

ప్రముఖ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ మృతిపై ‘శివరామరాజు’ సినిమా నటుడు వెంకట్ స్పందించాడు. హరికృష్ణ చనిపోయారంటే ఇంకా నమ్మలేకుండా ఉన్నాననీ వ్యాఖ్యానించాడు. సినిమా షూటింగ్ లో కేవలం తన క్యారెక్టర్ మాత్రమే కాకుండా మిగతా ఆర్టిస్టులందరినీ హరికృష్ణ పట్టించుకునేవారని వెల్లడించాడు. ఆయనకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణతో తన అనుభవాన్ని వెంకట్ పంచుకున్నాడు.

‘శివరామరాజు సినిమా కోసం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా నేను, జగపతిబాబు, శివాజీ పక్కపక్కనే నిలుచున్నాం. కొద్దిసేపటి తర్వాత ఫొటో సెషన్ అన్నారు. నా దగ్గరకు ఒకరు వచ్చి క్లీన్ షేవ్ చేసుకోమని చెప్పారు. ఆరాతీస్తే హరికృష్ణ గారు చెప్పారని తెలిసింది. సినిమాలో జగపతిబాబుకు, శివాజీకి మీసాలు ఉన్నాయి. పెద్దోడికి చిన్నోడికి మీసాలు ఉండి రెండో తమ్ముడికి లేకుంటే బాగోదని హరికృష్ణ అనుకున్నారు. ఆయన అంచనా నిజమైంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగా పండింది. దానికి హరికృష్ణ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను‘ అని వ్యాఖ్యానించాడు. శివరామరాజు సినిమా హిట్ అవుతుందని తమకు ముందే తెలుసని వెంకట్ అన్నాడు. 
harikrishna
Road Accident
venkat
hero
sivaramaraju

More Telugu News