కస్టమర్లలా వెళ్లిన పోలీసులు.. అమ్మాయితో మసాజ్ ఆఫర్... ఆటకట్టు!
- పైకి సెలూన్, లోపల క్రాస్ మసాజ్
- హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ఘటన
- నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
బోయిన్ పల్లికి చెందిన దురాయ్ రాజ్ గణేష్ అనే యువకుడు, ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెచ్చి వారితో పురుషులకు మసాజ్ చేయిస్తున్నాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించాడు. అందులో అందమైన అమ్మాయిల ఫొటోలను ఉంచి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అతని నిర్వాకంపై విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీసీ పోలీసులు, కస్టమర్లలా వెళ్లారు. వారికి కూకట్ పల్లికి చెందిన ఓ యువతితో మసాజ్ చేయించే ప్రయత్నం చేశాడు గణేష్. దాంతో ఆ యువతిని, నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.