పోలీస్ స్టేషన్‌లో స్నేహితులతో కలిసి మందేసిన కానిస్టేబుల్.. నిందితుడి భార్యను లాకప్‌లో బంధించి లైంగిక దాడికి యత్నం!

స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే మందేసిన ఓ కానిస్టేబుల్ నిందితుడి భార్యపై అత్యాచారానికి యత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌కు రావడంతో కానిస్టేబుల్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఖమ్మం జిల్లా రాపర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన.

అక్రమంగా బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నాడంటూ భద్రం అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. తన భర్తను కొడతారేమోనన్న అనుమానంతో భద్రం భార్య తన కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో స్నేహితులతో కలసి స్టేషన్‌లోనే మందేస్తున్న కానిస్టేబుల్ ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో కానిస్టేబుల్ వెనక్కి తగ్గాడు.

ఈ ఘటనపై బాధిత మహిళ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధిత మహిళ భర్త భద్రం మాట్లాడుతూ తన భార్యను వదిలిపెట్టమని బతిమాలుకున్నా కానిస్టేబుల్ కనికరించలేదని పేర్కొన్నాడు. స్థానికులు రావడంతోనే కానిస్టేబుల్ వెనక్కి తగ్గాడని, లేదంటే ఘోరం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Khammam District
Raparthi
constable
belt shop

More Telugu News