'లెజెండ్'లో ఛాన్స్ వస్తుందా .. రాదా? అని చాలా టెన్షన్ పడ్డాను: జగపతిబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లెజెండ్'లో ఛాన్స్ వస్తుందా .. రాదా? అని చాలా టెన్షన్ పడ్డాను: జగపతిబాబు

  • విలన్ గా చేస్తానా అనేది బోయపాటికి డౌట్ 
  • అడగడానికి ఆయన సందేహిస్తున్నారు 
  • అడిగితే బాగుండునని నేను ఎదురుచూస్తున్నాను  
తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో జగపతిబాబు మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. 'లెజెండ్' సినిమాకి ముందు అవకాశాలు లేక ఇంట్లోనే ఉండేవాడిని. ఒకసారి ఒక వ్యక్తి ఆటోలో మా ఇంటికి వచ్చి .. ఒక సినిమా కోసం నన్ను అడిగాడు. దర్శకుడు ఎవరు? అంటే తనేనని చెప్పాడు. నిర్మాత ఎవరంటే .. తనేనని అన్నాడు .. హీరో కూడా తనేనని చెప్పాడు. మరి నేనేంటి? అంటే .. 'కేరక్టర్ ఆర్టిస్ట్' అన్నాడు. అంత చులకనగా తయారైంది నా పరిస్థితి.

అలాంటి పరిస్థితుల్లోనే నా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి సంబంధించిన ఫొటోను బోయపాటి చూశారు. విలన్ గా చేస్తాడా .. చేయడా? అనేది బోయపాటి అనుమానం. అలా వారం పది రోజులు గడిచిపోవడంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా రారేంటి .. అడ్వాన్సులు ఇవ్వరేంటి? అని ఎదురు చూస్తున్నాను. ఆ తరువాత బోయపాటి వచ్చి కలిశారు. రెమ్యునరేషన్ దగ్గర నేను ఒక ఫిగర్ అనుకున్నాను .. వాళ్లు అంతకన్నా డబుల్ చెప్పడంతో మనసులోనే ఎగిరిగంతేశాను" అంటూ చెప్పుకొచ్చారు.     
jagapathibabu

More Telugu News