Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నానితో ‘సోడా కావాలా? వాటర్ కావాలా?’ అంటున్న నాగార్జున

  • ‘దేవదాస్’ టీజర్ విడుదల
  • నాగ్, నాని కలిసి మద్యం తాగేందుకు కూర్చున్న సీన్
  • ఆకట్టుకున్న టీజర్
అక్కినేని నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ టీజర్ ఈరోజు విడుదలైంది. నాగార్జున, నాని కలిసి మద్యం సేవించేందుకు కూర్చున్న సన్నివేశం ఈ టీజర్ లో కనబడుతుంది. ‘సోడా కావాలా? వాటర్ కావాలా?’ అని నాగ్ అడిగే లోపే, నాని తన మద్యం గ్లాస్ ను ఖాళీ చేయడం నవ్వు తెప్పిస్తుంది.

‘దాసూ.. ఏంటీ సంగతి?’ అని నాగార్జున ప్రశ్నించడం..‘ఆ..’ అంటూ నానీ మూతి తుడుచుకునే సన్నివేశం తమాషాగా ఉంది. కాగా,‘స్మాల్ పెగ్ టుమారో @ 5 పీఎం’ అంటూ నిన్న చిత్రయూనిట్ ట్వీట్ చేయడం తెలిసిందే. అలా చెప్పినట్టుగానే, నాగ్, నానీలు పెగ్ వేసేందుకు కూర్చుని ఉండటం టీజర్ లో కనిపిస్తుంది.
devadas
Nagarjuna
nani

More Telugu News