Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్తతో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా

  • భర్త తనను గొంతు నులిమి చంపబోయాడని ఫిర్యాదు  
  • బిగ్ బాస్ షో తో పాప్యులర్ అయిన నటి, మోడల్, సింగర్
  • లండన్ లోని ఒక షాపింగ్ మాల్ లో సోఫియా భర్త వ్లాద్‌ స్టానెస్కు అరెస్ట్
హిందీ బిగ్ బాస్ 7 షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ పడి బిగ్ బాస్ షో నుండి మధ్యలోనే నిష్క్రమించిన మోడల్ సోఫియా హయత్‌ గుర్తుందిగా? ఇప్పుడీ అమ్మడు భర్త తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెలరోజుల గాలింపు అనంతరం సోఫియా హయత్ భర్త వ్లాద్‌ స్టానెస్కును లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

      సోఫియా 2017లో రొమేనియాకి చెందిన వ్లాద్ స్టానెస్కును ప్రేమించి పెళ్లాడింది. పెళ్లికి ముందు తాను ఇంటీరియర్ డిజైనర్‌ నని చెప్పి భర్త తనను మోసం చేశాడని, తన గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాదు, 10 లక్షల రూపాయల విలువ చేసే తన వివాహ ఉంగరాన్ని దొంగిలించి, దానిని 1.5 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడని ఆమె ఆరోపించింది.

సింగర్ గా , మోడల్ గా పాప్యులర్ అయిన సోఫియా హయత్  భర్తపై చేసిన కంప్లైంట్ తో లండన్ పోలీసులు ఒక షాపింగ్ మాల్ లో వ్లాద్‌ స్టానెస్కును అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ షో లోనే కాదు సోఫియా నిజ జీవితంలో కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంది. 2016లో తాను నన్ గా మారినట్లు ప్రకటించింది. ఆపై ఆమె మామూలు జీవితమే గడుపుతూ, మేకప్ వాడుతున్నట్లు ఆమె ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ చెప్పిన సోఫియా ఇప్పుడు భర్త విషయంలో ఏకంగా ప్రాణహాని ఉందని  కేసుపెట్టింది.
Sofia Hayat
bigboss

More Telugu News