అందుబాటులోకి రానున్న పోర్టబుల్ పెట్రోల్ బంక్ లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!
- పోర్టబుల్ డిజైన్తో ముందుకు వచ్చిన అలింజ్ గ్రూప్
- 20X20 మీటర్ల స్థలంలో ఏర్పాటు
- 10 వేల నుంచి 35 వేల లీటర్ల సామర్థ్యం
ట్యాంక్ సామర్థ్యాన్ని పెంచాల్సి వస్తే స్థలం పెరుగుతుందంటోంది. డిజిటల్ చెల్లింపులతోపాటు సీసీ కెమెరా భద్రత ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపామని, దేశమంతటా ఈ పోర్టబుల్ పంపులు ఏర్పాటే తమ లక్ష్యమని అలింజ్ గ్రూప్ సంస్థ ఎండీ ఇంద్రజిత్ తెలిపారు. పోర్టబుల్ ఎల్పీజీ అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.