నాకు ఈగో ఎక్కువనే ప్రచారంలో నిజం లేదు: కిరాక్ ఆర్పీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఈగో ఎక్కువనే ప్రచారంలో నిజం లేదు: కిరాక్ ఆర్పీ

  • చీకాకు అందరికీ వుండేదే 
  • ఇబ్బందిని అర్థం చేసుకోరు 
  • 'ఈగో' అనే ట్యాగ్ తగిలించేస్తారు  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన నటులలో 'కిరాక్ ఆర్పీ' ఒకరు. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన అందరికీ కితకితలు పెట్టేస్తాడు. అలాంటి 'కిరాక్ ఆర్పీ' .. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "మీకు చీకాకు ఎక్కువనీ .. ఈగో ఎక్కువని చెప్పుకుంటూ వుంటారు .. దీనికి మీరేమంటారు?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అప్పుడు ఆయన స్పందిస్తూ .. "ఒక ఇంటికి వెళ్లాను .. వాళ్లు 'టీ తాగుతారా' అని అడిగితే వద్దని చెబుతాను. మళ్లీ అడిగితే ఇప్పుడే తాగేసి వచ్చానండి అంటాను .. అయినా మళ్లీ అడిగారనుకోండి .. 'చెప్పాను కదండీ వద్దని' అంటాను .. దానిని చీకాకు అంటారా? విసిగిస్తే అలా మాట్లాడటం ప్రతి ఒక్కరూ చేసేదే. ఇక 'ఈగో' ఎక్కువ అంటున్నారు .. నాకున్నది 'ఈగో' కాదు .. ఇబ్బంది. హాస్పిటల్ కి హడావిడిగా వెళితే అక్కడ సెల్ఫీ అడుగుతారు .. ఇవ్వనంటే వినిపించుకోరు. ఎదురుగా వచ్చి ఫేస్ పై ఫోన్ పెడతారు .. 'చెబితే అర్థం కావడంలేదా?' అంటే .. 'ఈగో' అనేస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.
kirak rp

More Telugu News