ఈ అమ్మాయి ఎవరు?... తెలిస్తే చెప్పాలంటున్న హైదరాబాద్ పోలీసులు!

  • పోలీసులకు పట్టుబడిన మతిస్థిమితం లేని యువతి
  • తల్లిదండ్రుల పేర్లు మినహా మరేమీ చెప్పలేకపోతున్న వైనం 
  • రక్షణ సదనంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు
తన పేరు, తన తల్లిదండ్రుల పేర్లు మినహా మరేమీ చెప్పలేకపోతున్న ఓ యువతి దీనస్థితి ఇది. ఆమె ఎవరో తెలిస్తే చెప్పాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని పినిశెట్టి మహేశ్వరి (19) ఇంటి నుంచి తప్పిపోయి, ఆదివారం రాత్రి చిక్కడపల్లి పోలీసులకు కనిపించింది.

ఆమెను ప్రస్తుతం రక్షణ సదనంలో ఉంచిన పోలీసులకు, మహేశ్వరి అన్న తన పేరు, ఆమె తండ్రి రవీంద్ర, తల్లి మాధవి అన్న వివరాలు మినహా మరేమీ చెప్పలేకపోతోంది. తాను ఎక్కడ ఉంటుందన్న ప్రాంతాన్ని కూడా ఆమె చెప్పడం లేదు. మహేశ్వరి ఫొటోను విడుదల చేసిన పోలీసులు, కుటుంబీకుల కోసం వాకబు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Police
Lady
Maheshwari

More Telugu News