హెచ్‌సీయూ రిటైర్డ్ ఫ్రొఫెసర్ కాళ్లకు నమస్కరించిన పవన్.. తనది ఆయన స్థాయి కాదన్న జనసేనాని!
- హెచ్‌సీయూ ప్రొఫెసర్ కు సన్మాన సభ
- ఆయనకున్న మేధస్సు తనకు లేదని వ్యాఖ్య
- నేర్చుకోవాలన్న తపన ఉందన్న పవన్
ప్రసంగం ముగించిన అనంతరం పవన్ నేరుగా సుధాకర్ రావు వద్దకెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సుధాకర్ రావు గత నెలలోనే రిటైర్ అయ్యారు. సంచార జాతుల జీవనంపై 'ఎతనోగ్రఫీ ఆఫ్ ఎ నోమాడిక్ ట్రైబ్' అనే పుస్తకాన్ని రాశారు. సంచార జాతుల జీవనం గురించి ప్రపంచానికి తెలియజేసిన ఆయన సేవలు గొప్పవని కొనియాడుతూ పవన్ ఆయన కాళ్లకు నమస్కరించారు.