ప్రియురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి.. 5 కోట్లు డిమాండ్ చేసిన ప్రియుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి.. 5 కోట్లు డిమాండ్ చేసిన ప్రియుడు!

  • ఇంటర్నెట్ లో ఫొటోలు పెడతానంటూ బెదిరింపులు
  • ఇప్పటికే రెండున్నర లక్షలు ఇచ్చిన ప్రియురాలు
  • టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు
ప్రేమ పేరుతో ప్రియురాలిని దారుణంగా వంచించేందుకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, వినేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతగాడిని బాగా నమ్మింది. కానీ, మనసులో చెడు ఆలోచనలు ఉన్న వినేష్... ఆమె ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి... వాటిని చూపిస్తూ డబ్బులివ్వాలని బెదిరించడం ప్రారంభించాడు. డబ్బు ఇవ్వకపోతే ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు.

 దీంతో, ఆమె ఇప్పటికే రూ. 2.5 లక్షలు అతనికి ఇచ్చింది. తాజాగా రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరించాడు. టార్చర్ ఎక్కువవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సినీఫక్కీలో ఛేజ్ చేసి వినీష్ ను కామారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు. వినీష్ కు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.
lover
harrassment
money

More Telugu News