Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విషాదంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబం!

  • జలీల్‌ఖాన్‌ సోదరుడి కుమారుడు గుండెపోటుతో మృతి 
  • ఆటోనగర్‌లో ఐరన్‌ వ్యాపారం చేసే మోసిన్‌ఖాన్‌
  • ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ జలీల్‌ఖాన్‌ సోదరుడు షబ్బీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కుమారుడు మోసిన్‌ఖాన్‌ గుండె పోటుతో మృతి చెందారు. సోదరుని కుమారుని మృతితో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబంలో విషాదం నిండిపోయింది. వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయవాడ ఎంపి కేశినేని నాని , తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు మోసిన్ ఖాన్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

27సంవత్సరాల మోసిన్‌ఖాన్‌ ఆటోనగర్‌లో ఐరన్‌ వ్యాపారం చేసేవాడు. ఆటోనగర్ లోని షాప్ లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే బయలుదేరి సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్ళాడు. తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం కూడా తెలియజేశాడు. అయితే, గుండెపోటు తీవ్రంగా రావడంతో కాసేపటికే మృతి చెందాడు. చెట్టంత కొడుకు మృతితో జలీల్ ఖాన్ సోదరుడు షాక్ కు గురయ్యారు. కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అవుతోంది. మోసిన్‌ఖాన్‌ మృతదేహాన్ని పాతబస్తీ తారాపేటలోని ఎమ్మెల్యే నివాసానికి తరలించారు. మృతుడుకి భార్య, ఆరునెలల కూతురు ఉన్నారు.
Jaleel Khan

More Telugu News