కొరటాలతో ఎన్టీఆర్ మూవీ ఖాయమైనట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరటాలతో ఎన్టీఆర్ మూవీ ఖాయమైనట్టే!

  • గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' హిట్ 
  • ఎన్టీఆర్ కి లైన్ వినిపించిన కొరటాల 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఎన్టీఆర్  
కొరటాల శివ .. ఎన్టీఆర్ తో చేసిన 'జనతా గ్యారేజ్' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఎమోషన్ .. యాక్షన్ తో కూడిన ఈ సినిమా, ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఓకే అయిపోయినట్టేననేది తాజా సమాచారం.

ఇటీవల కొరటాల .. ఎన్టీఆర్ ను కలిసి ఒక లైన్ చెప్పారట. వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఇంతవరకూ తాను చెయ్యని పాత్ర కావడంతో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా వున్నాడని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందుగా చిరంజీవితో కొరటాల ఒక సినిమా చేయవలసి వుంది. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలై .. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాతనే ఎన్టీఆర్ .. కొరటాల కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుంది.  
koratala
ntr

More Telugu News