చంద్రబాబు చూపించే రెండు వేళ్లల్లో ఒకటి బాబు, రెండోది లోకేశ్!: పవన్ కల్యాణ్

  • నేనెప్పుడూ ‘పిడికిలి’ చూపిస్తాను
  • చంద్రబాబు రెండు వేళ్లు చూపిస్తారు
  • ఐదువేళ్లతో అన్నం కలుపుకు తినొచ్చు
  • రెండు వేళ్లతో కలుపుకు తినలేం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, తానెప్పుడూ ‘పిడికిలి’ చూపిస్తానని, అదే, చంద్రబాబు అయితే రెండు వేళ్లు చూపిస్తారని అన్నారు. ‘పిడికిలి’ అంటే సమష్టితత్వానికి గుర్తు, అన్నం తినాలంటే ఐదువేళ్లతో కలుపుకోవాలి, ప్రజలంటే తనకు ప్రేమ అని చెప్పడానికి పిడికిలితోనే తన గుండెపై గుద్దుకుంటూ చెబుతానని అన్నారు.

అదే చంద్రబాబు చూపించే ఆ రెండు వేళ్లల్లో ఒకటి చంద్రబాబు, మరోటి నారా లోకేశ్ అని, రెండు వేళ్లు జేబులో నుంచి డబ్బులు తీసుకోవడానికి పనికొస్తాయి తప్ప, అన్నం కలుపుకు తినడానికి పనికిరావని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పని జరిగినా దానికి కారణం ‘నేను’ అని చంద్రబాబు అంటారే తప్ప, తమ పార్టీ నేతలు, నాయకులు కారణమని చెప్పిన సందర్భాలు లేవని, అదే పోలిక చంద్రబాబు తనయుడు లోకేశ్ కు కూడా వచ్చిందని విమర్శించారు. 
Go Back to Shorts
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News