‘గీత గోవిందం’ సినిమా లీక్ కేసులో కీలక నిందితుడి అరెస్టు!
- నిందితుడి పేరు పడవల రాజేశ్
- ఫిలింనగర్ లో డేటా డిజిటల్ బ్యాంకు లో అడ్మిన్
- గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు వెల్లడి
కాపీ చేసుకున్న ఈ సినిమా వీడియోను పెన్ డ్రైవ్ ల ద్వారా తన స్నేహితులకు, అదే విధంగా, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు రాజేశ్ పంపినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు రాజేశ్ నుంచి 3 ల్యాప్ టాప్ లు, 3 పెన్ డ్రైవ్ లు, 3 హార్డ్ డిస్క్ లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ వీడియోను షేర్ చేసిన మరో ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశామని అన్నారు. కాగా, మరోపక్క, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఇంకా విడుదల కానీ ‘ట్యాక్సీ వాలా’ చిత్రాన్ని కూడా పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.