ఆర్ఎక్స్ 100 హిట్టయ్యాకే నా ప్రేమకు ఓకే చెప్పారు!: అజయ్ భూపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్ఎక్స్ 100 హిట్టయ్యాకే నా ప్రేమకు ఓకే చెప్పారు!: అజయ్ భూపతి

  • సెటిల్ కాకపోవడంతో మా పెళ్లికి ఒప్పుకోలేదు
  • సక్సెస్ కోసం రెండేళ్ల సమయం కోరా
  • ఈ నెల 25న హైదరాబాద్ లో వివాహం
తక్కువ బడ్జెట్, పెద్దగా పేరు లేని నటీనటులతో తీసిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో అజయ్ భూపతి భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అజయ్ కు పలువురు నిర్మాతల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆర్ఎక్స్ సినిమా కారణంగానే అజయ్ పెళ్లి కన్ఫామ్ అయిందట. ఈ విషయాన్ని అజయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు.


తన చిన్ననాటి స్నేహితురాలు శిరీషను ఈ నెల 25న పెళ్లి చేసుకోబోతున్నట్లు అజయ్ చెప్పాడు. రెండేళ్ల క్రితమే శిరీషకు తాను ప్రపోజ్ చేశాననీ, కానీ ఉద్యోగం, ఆదాయం లేని కారణంగా వాళ్ల ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లికి అంగీకరించలేదని వెల్లడించాడు. దీంతో తనకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సిందిగా శిరీష కుటుంబ సభ్యుల్ని కోరానని అజయ్ తెలిపాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారుతానని వాళ్లకు మాటిచ్చాననీ, దాన్ని నిలబెట్టుకున్నానని అజయ్ చెప్పాడు.

ఆర్ఎక్స్ 100 ట్రైలర్ రిలీజ్ కాగానే తన మీద శిరీష కుటుంబ సభ్యులకు నమ్మకం వచ్చిందని అజయ్ అన్నాడు. సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో శిరీష తల్లిదండ్రులు పెళ్లికి ఆనందంగా ఓకే చెప్పారని సంతోషం వ్యక్తం చేశాడు. తమ వివాహం హైదరాబాద్ లోనే జరుగుతుందని అజయ్ తెలిపాడు. తామిద్దరిది ఆత్రేయపురమేనని, శిరీష బీటెక్ చదువుకుందని అజయ్ చెప్పాడు.
rx100
ajay bhupati
marriage
Hyderabad

More Telugu News