పెన్ డ్రైవ్ లలో 'గీత గోవిందం'... లీక్ వెనుక కేఎల్ వర్శిటీ విద్యార్థిని!
- సినిమాను పలువురికి పంపిన అమ్మాయి
- పోలీసుల విచారణలో చెప్పిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్
- ఎడిటింగ్ విభాగం నుంచి లీక్ అయినట్టు అనుమానం
ఇందులో భాగంగా పలువురు స్టూడెంట్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, వారిని ప్రశ్నించగా, ఓ విద్యార్థిని తమకు ఈ సినిమాను పంపించిందని చెప్పారు. ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుని ఈ లీక్ వెనకున్న అసలు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆ అమ్మాయికి పరిచయమున్న ఓ యువకుడు సినిమా ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడని, అతనే తన వద్ద ఉన్న సినిమాను అత్యుత్సాహంతో ఆమెకు పంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు.