Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎన్టీఆర్' బయోపిక్ లో రకుల్ ఖరారు

  • సెట్స్ పై 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • చంద్రబాబుగా రానా.. ఏఎన్నార్ గా సుమంత్ 
  • శ్రీదేవి పాత్రలో రకుల్    
ఎన్టీ రామారావు జీవితచరిత్రగా 'ఎన్టీఆర్' సినిమా రూపొందుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారు. ఇక బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను చాలావరకూ చిత్రీకరించారు. ఈ సినిమాలో చంద్రబాబునాయుడి పాత్రను రానా .. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది. శ్రీదేవి పాత్రకి ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ .. శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రకి కూడా స్థానం వుంది. ఈ పాత్ర కోసమే రకుల్ ను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  
balakrishna
rakul

More Telugu News