ఇమ్రాన్ మాజీ భార్యకు వేధింపులు.. హుందాగా స్పందించిన రేహమ్!
- బ్రిటన్ లో రేహమ్ ను వేధించిన మరో మహిళ
- ప్రశాంతంగా జవాబిచ్చిన జర్నలిస్ట్
- రేహమ్ కు నెటిజన్ల మద్దతు
ఇమ్రాన్ ను 2015లో పెళ్లి చేసుకున్న రేహమ్.. 9 నెలలకే అభిప్రాయభేదాలతో విడిపోయింది. అనంతరం ఇమ్రాన్ వ్యక్తిగత అలవాట్లపై ఆమె రాసిన పుస్తకం సంచలనం రేపింది. దీంతో ఇమ్రాన్ అభిమానులు రేహమ్ ను లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్బంగా పలువురు నెటిజన్లు రేహమ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ గురించి రేహమ్ చెప్పిన మాటలు నమ్మకపోయినా ఆమెను ఈ రకంగా వేధించడం సరికాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.