'RISH'తో పాటు 'I'ని రివీల్ చేసిన వంశీ పైడిపల్లి... మహేష్ టైటిల్ అదేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'RISH'తో పాటు 'I'ని రివీల్ చేసిన వంశీ పైడిపల్లి... మహేష్ టైటిల్ అదేనా?

  • ఐదు అక్షరాలు వదిలిన మహేష్ చిత్ర టీమ్
  • సినిమా టైటిలా? చిత్రంలో మహేష్ పాత్ర పేరా?
  • మరో మూడు రోజుల్లో వెల్లడి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు తాజా చిత్రం పేరు ఏంటి? ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు, ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్న విషయమిది. అశ్వనీదత్, దిల్ రాజులు నిర్మాతలుగా తయారవుతున్న చిత్రం ఫస్ట్ లుక్ ను 9వ తేదీ మహేష్ జన్మదినం సందర్భంగా విడుదల చేస్తామని ఇప్పటికే టీమ్ వెల్లడించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా రోజుకో అక్షరాన్ని బయటకు లీక్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటివరకూ 'ఆర్', 'ఐ', 'ఎస్', 'హెచ్', 'ఐ' అన్న అక్షరాలు బయటకు వచ్చాయి.

'ఐ' లెటర్ ను ఈ ఉదయం 9:15 గంటల సమయంలో సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో రివీల్ చేశాడు. వీటిని చూస్తుంటే ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సినిమా పేరు 'రిషి' అని కొందరు 'మహర్షి' అయ్యుంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇక చిత్రంలో మహేష్ పాత్ర పేరు 'రిషి' అయ్యుంటుందని, సినిమా పేరు వేరేగా ఉంటుందని అంటున్నవారూ లేకపోలేదు. ఏదేమైనా ఈ విషయంలో సస్పెన్స్ తొలగాలంటే, మరో మూడు రోజులు ఆగక తప్పదు.
Mahesh Babu
Vamsi Paidipally
Rishi
Maharshi

More Telugu News