నా భార్యను సౌదీ షేక్ కు అమ్మేశారంటూ కంటతడి పెడుతున్న కడప జిల్లా వాసి!
- సౌదీ షేక్ కు బాధితురాలిని అమ్మేసిన రైల్వే కోడూరుకు చెందిన ఏజెంట్
- ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందంటున్న భర్త
- పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదంటూ ఆవేదన
షేక్ కుటుంబసభ్యులు తన భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని వెంకటరమణ కంటతడి పెట్టాడు. ఇండియాకు రప్పించలేకపోతే, ఆత్మహత్య చేసుకుంటానంటూ తన భార్య ఏడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డాడు. తమను మోసగించిన ఏజెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.