Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లతో ఏం చేస్తారు?: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్న
  • ఆటోమేషన్ తో ఉద్యోగాలు తగ్గాయని వెల్లడి
  • అన్నివర్గాల్లోనూ నిరుపేదలు ఉన్నారని వ్యాఖ్య
విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్రలో మరాఠాలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూడా కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ కల్పించాలని కోరుతోంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ తరహా డిమాండ్లపై కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

ప్రస్తుతం ఆటోమేషన్ కారణంగా దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ఉద్యోగానికీ గ్యారెంటీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో సైతం నియామకాలు మందగించిన విషయాన్ని గడ్కరీ గుర్తు చేశారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ ధనికులు ఉన్నారనీ, అదే సమయంలో కనీసం తిండి, బట్టలకు నోచుకుని నిరుపేదలు అగ్రవర్ణాల్లోనూ ఉన్నారని అభిప్రాయపడ్డారు.

మరాఠాల రిజర్వేషన్ పోరాటంపై స్పందిస్తూ..‘ప్రస్తుతం ఐటీ, ఆటోమేషన్ కారణంగా బ్యాంకుల్లో ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ నియామకాలు స్తంభించాయి. ఇలాంటప్పుడు రిజర్వేషన్ ఇచ్చినా ప్రయోజనం ఏముంటుంది?’ అని గడ్కరీ ప్రశ్నించారు. రిజర్వేషన్ అన్నది ఓ రాజకీయ అస్త్రంగా మారుతోందనీ, బిహార్, ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉన్న బ్రాహ్మణులు సైతం తాము వెనుకబడ్డామని చెప్పుకుంటున్నారని గడ్కరీ అన్నారు.
Nitin Gadkari
Maharashtra
reservation

More Telugu News