ఉమ్మడి కార్యాచరణతో ప్రజా సమస్యలపై పోరాడనున్న ‘జనసేన’, వామపక్షాలు
- హైదరాబాద్ లో పవన్ తో వామపక్ష నేతల భేటీ
- అమరావతి నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు
- త్వరలో విజయవాడలో మరోమారు సమావేశం
అనంతరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధర్ మాట్లాడుతూ, తమతో కలిసి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పలు ప్రజా సమస్యలపై, సర్కార్ వైఫల్యాలపై స్పందించాయి. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఈ పోరాటాలు చేయడంపై మరోసారి విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమే కాదు, పరిష్కారం దిశగా కూడా వెళ్లాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకమంటూ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.