100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ధడక్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ధడక్'

  • ప్రేమకథా చిత్రంగా 'ధడక్'
  • ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ పరిచయం 
  • తొలివారంలో 63.39 కోట్లు    
ఇషాన్ కట్టర్ .. జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన 'ధడక్' .. జూలై 20వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమకథా చిత్రంగా వచ్చిన 'ధడక్' .. యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. జాన్వీకి ఇది తొలి సినిమానే అయినా, నటన పరంగాను .. గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. శ్రీదేవి కూతురు అనిపించుకుందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అపూర్వ మెహతా .. కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 63.39 కోట్లను వసూలు చేసింది. 10 రోజుల తరువాత ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టేసింది. తొలి చిత్రంతోనే జాన్వీ 100 కోట్ల ఫీట్ ను సాధించడం పట్ల అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విజయంలో ఆమె ప్రధానమైన పాత్రను పోషించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   
ishan
jhanvi

More Telugu News