ఇద్దరు డ్యాన్సర్లను తీసుకొచ్చి రూమ్ అడిగిన ఎంబీఏ విద్యార్థి... పోలీసులకు పట్టించిన స్టార్ హోటల్ సిబ్బంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇద్దరు డ్యాన్సర్లను తీసుకొచ్చి రూమ్ అడిగిన ఎంబీఏ విద్యార్థి... పోలీసులకు పట్టించిన స్టార్ హోటల్ సిబ్బంది!

  • ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేసుకుని వచ్చిన ఇబ్రహీం
  • ఐడీ కార్డు, వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు
  • పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి
హైదరాబాద్, బంజారాహిల్స్ పరిధిలోని పార్క్ హయత్ స్టార్ హోటల్ కు ఇద్దరు డ్యాన్సర్లతో వచ్చి వ్యభిచారయత్నం చేసిన ఓ ఎంబీఏ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేసుకుని వచ్చి, ధ్రువీకరణ పత్రాలను చూపేవేళ అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎంబీఏ చదువుతున్న ఇబ్రహీం అనే విద్యార్థి, హైదరాబాద్ కు చెందిన ఓ డ్యాన్సర్ ను, పశ్చిమ బెంగాల్ కు చెందిన మరో డ్యాన్సర్ ను తీసుకొచ్చాడు. అప్పటికే అతని పేరిట రూమ్ బుక్ అయి ఉండటంతో, రిసెప్షన్ కు వెళ్లి తాళాలడిగాడు.

ఈ క్రమంలో అతని ఐడీ కార్డు అడిగితే లేదని చెప్పాడు. అమ్మాయిల గురించి ఆరాతీస్తే పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వారు, కాసేపు లాబీలో వెయిట్ చేయాలని చెబుతూ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, సల్మాన్ అనే వ్యక్తి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో కలసి ఇద్దరు యువతులను అప్పగించాడని, అతనికి రూ. 11 వేలు ఇచ్చానని చెప్పాడు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించామని, ఇబ్రహీంపై కేసు పెట్టామని, పరారీలో ఉన్న సల్మాన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Hyderabad
Police
Arrest
Park Hayat
Dancers
Prostitution

More Telugu News