నటి అదితీరావు సంచలన వ్యాఖ్యలు.. తానూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ఆవేదన!
- 8 నెలలపాటు చేతిలో పని నిల్
- అయినా, క్యాస్టింగ్ కౌచ్‌కు నో
- సత్తా ఉంటే అవకాశాలు అవే వస్తాయన్న అదితి
ఆ సమయంలో తాను ఏడ్చేశానని, నిస్సహాయత ఆవరించిందని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి తనతో మాట్లాడడానికి వారికెంత ధైర్యం అనుకునే దానినని పేర్కొన్న అదితి దాదాపు 8 నెలలుపాటు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. చేతిలో ఏ సినిమా లేకున్నా తాను తీసుకున్న నిర్ణయం (క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా) తనను మరింత బలంగా తయారుచేసిందని వివరించింది. సినీ పరిశ్రమలో పవర్ ప్లే నడుస్తుంటుందని, దాని వలలో అమ్మాయిలు పడకూడదని హెచ్చరించింది. నిజంగా మనలో సత్తా ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని తెలిపింది.
అదితి తన సినీ కెరియర్‌ను 2006లో మలయాళంలో ‘ప్రజాపతి’ సినిమాతో ప్రారంభించింది. అయితే, 2011లో వచ్చిన ‘యె సాలీ జిందగీ’ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన అదితి నటించిన తమిళ సినిమా ‘చెక్కా చివంత వానమ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.