ఇమ్రాన్ ఖాన్ కు మరో 21 మంది అవసరం.. మొదలైన చర్చలు!
- మ్యాజిక్ ఫిగర్ 137.. ఇమ్రాన్ పార్టీకి వచ్చింది 116
- చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్న ఇమ్రాన్
- పీఎంఎల్, పీపీపీలతో జతకట్టబోమన్న ఖాన్
మరోవైపు పోలింగ్ సమయంలో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ పాక్ సైన్యం సహకారంతో రిగ్గింగ్ కు పాల్పడిందని పీఎంల్ సహా పలు పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో, పోలింగ్ కు సంబంధించి ఎలాంటి దర్యాప్తునైనా చేసుకోవచ్చని ఇమ్రాన్ తెలిపారు. పాక్ జాతీయ అసెంబ్లీకి మొత్తం 272 స్థానాలు ఉన్నాయి. వీటిలో 270 స్థానాలకు పాక్ ఎన్నికల కమిషన్ నేడు ఫలితాలను వెల్లడించింది. రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరోవైపు, కొన్ని స్థానాలకు సంబంధించి రీకౌంటింగ్ జరుగుతోంది. దీంతో, చివరి ఫలితాలు కొంచెం మారే అవకాశం కూడా ఉంది.