మసాలా దట్టించమని విక్రమ్ కుమార్ తో చెప్పిన బన్నీ
Add ap7am to your home Screen

మసాలా దట్టించమని విక్రమ్ కుమార్ తో చెప్పిన బన్నీ

  • బన్నీ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు 
  • కథపై విక్రమ్ కుమార్ కసరత్తు 
  • బన్నీకి నచ్చితే సెట్స్ పైకి      
'నా పేరు సూర్య' తరువాత సినిమాను కొరటాల శివతో గానీ .. త్రివిక్రమ్ తో గాని బన్నీ చేయాలనుకున్నాడు. అయితే అప్పటికే ఈ ఇద్దరు దర్శకులు వేరే హీరోలతో కమిటైపోయారు. ఆ ప్రాజెక్టులను వాళ్లు పూర్తిచేయడానికి చాలా సమయం పడుతుంది గనుక, విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.

 అయితే విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నీకి నచ్చలేదనీ .. దాంతో మరో హీరో కోసం వేరే కథను విక్రమ్ కుమార్ రెడీ చేసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే విక్రమ్ కుమార్ మరో కథను సిద్ధం చేస్తున్నది బన్నీ కోసమేననేది తాజా సమాచారం. తమ కాంబినేషన్లో వచ్చే సినిమాలో మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు పుష్కలంగా ఉండాలనీ, అందుకు తగిన విధంగా కథ తయారుచేయమని బన్నీ చెప్పాడట. ప్రస్తుతం విక్రమ్ కుమార్ అదే పనిలో వున్నాడని అంటున్నారు.  
Allu Arjun
vikram kumar

More Telugu News