నాగశౌర్య జోడీగా ఛాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా
- 'అమీతుమీ'తో గుర్తింపు
- 'అ' సినిమాతో క్రేజ్
- అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్
'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఎన్టీఆర్ జోడీగాను చేస్తోన్న ఈ అమ్మాయి, తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజా అనే దర్శకుడు నాగశౌర్య హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో జగపతిబాబు హీరోగా చేసిన 'ఆయనకి ఇద్దరు' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బా ను తీసుకున్నారట. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ .. ఆమె మరింత బిజీ అవుతుందని అంటున్నారు. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.