'కర్తవ్యం'లాంటి సినిమా చేయాలనుంది: నిహారిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కర్తవ్యం'లాంటి సినిమా చేయాలనుంది: నిహారిక

  • కథను .. పాత్రను నమ్మి చేశాను 
  • మా నాన్న గుర్తుకొచ్చేవాడు 
  • 'సైరా'లో చేస్తున్నందుకు సంతోషంగా వుంది
నిహారిక కథానాయికగా నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి నిహారిక ప్రస్తావించింది. "కథను .. నా పాత్రను నమ్మి నేను ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో నా తండ్రి పాత్రలో మురళీశర్మగారు నటించారు. ఆయన కాంబినేషన్లో సీన్ చేసినప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తుకొచ్చేవాడు .. వెంటనే ఆయనకి ఫోన్ చేసేదాన్ని" అంది.

ఇంకా ఓ అయిదారు సంవత్సరాలకి మించి నేను సినిమాలు చేయకపోవచ్చు. ఈ లోగా 'కర్తవ్యం' లాంటి సినిమా చేయాలనుంది. ఇటీవలే ఈ విషయాన్ని పరుచూరిగారితో చెప్పాను .. ఆయన కథ రాస్తే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను. ఇక చిరంజీవి గారితో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది .. అది 'సైరా' సినిమాతో నెరవేరుతున్నందుకు సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చింది.  
niharika

More Telugu News