రాజమౌళి చాలెంజ్ ని పూర్తిచేసి.. మహేష్ బాబుకు చాలెంజ్ విసిరిన కేటీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి చాలెంజ్ ని పూర్తిచేసి.. మహేష్ బాబుకు చాలెంజ్ విసిరిన కేటీఆర్!

  • కవిత విసిరిన 'హరితహారం' చాలెంజ్ పూర్తి చేసిన రాజమౌళి
  • దాన్ని కేటీఆర్ కు ఫార్వార్డ్ చేయడంతో మొక్కలు నాటిన కేటీఆర్
  • మహేష్, సచిన్, లక్ష్మణ్ లను ట్యాగ్ చేసిన కేటీఆర్
రాజమౌళి విసిరిన 'హరితహారం' చాలెంజ్ ని పూర్తి చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్, అదే పని చేసి చూపాలని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సహా, పలువురిని చాలెంజ్ చేశారు. అంతకుముందు నిజామాబాద్ ఎంపీ కవిత రాజమౌళిని ట్యాగ్ చేస్తూ, హరితహారం చాలెంజ్ ని విసరగా, దాన్ని పూర్తి చేసిన రాజమౌళి, కేటీఆర్ కు చాలెంజ్ ని ఫార్వార్డ్ చేసిన సంగతి తెలిసిందే.

తాను నిమ్మ తదితర చెట్లను నాటానని చెబుతూ, పుల్లెల గోపీచంద్, కేటీఆర్, వంగా సందీప్, నాగ్ అశ్విన్ లను రాజమౌళి ట్యాగ్ చేశారు. రాజమౌళి సవాల్ ను స్వీకరించిన కేటీఆర్, నిన్న రోజ్ ఉడ్, గోల్డెన్ చంపా మొక్కలను నాటి, మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాజ్ దీప్ సర్ దేశాయ్ లకు సవాల్ ను ఫార్వార్డ్ చేసి, ఒక్కొక్కరూ కనీసం మూడు మొక్కలు నాటి చూపాలని కోరారు. ఇక కేటీఆర్ చాలెంజ్ పై వీరంతా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
K Kavitha
Rajamouli
KTR
Mahesh Babu
Sachin Tendulkar
Haritahaaram

More Telugu News