మణిరత్నంకు గుండెపోటు వార్తల్లో నిజం లేదన్న ప్రతినిధులు

  • మణిరత్నం ఆరోగ్యంగానే ఉన్నారు
  • సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారు
  • ఆందోళన చెందక్కర్లేదన్న మణిరత్నం ప్రతినిధులు
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు వచ్చిందని, ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యసేలందిస్తున్నారని ఈ సాయంకాలం మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలను ఆయన ప్రతినిధులు కొట్టిపారేశారు. కేవలం సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వెళ్లారని చెప్పారు.

మణిరత్నం ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన అభిమానులు, మిత్రులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ప్రస్తుతం ‘చెక్క చీవంత వాణం’ తమిళ సినిమాను మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’గా విడుదల కానుంది.
Go Back to Shorts
maniratnam
director

More Telugu News