బిగ్‌బాస్ 2లో వీడిన సస్పెన్స్.. ఎంట్రీ ఇచ్చిన ‘స్వామి రారా’ హీరోయిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్ 2లో వీడిన సస్పెన్స్.. ఎంట్రీ ఇచ్చిన ‘స్వామి రారా’ హీరోయిన్!

  • హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్
  • కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించిన బిగ్ బాస్
  • యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పార్టిసిపెంట్స్
హుషారుగా, ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్ 2 హౌస్‌లోకి సీక్రెట్‌గా ఎంటరైన నటి ఎవరో తెలిసిపోయింది. లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా రామచంద్రన్ అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి సభ్యులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. పరిచయాలయ్యాక బిగ్ బాస్ షో గురించి బయట టాక్‌ను ఆమెను అడిగి తెలుసుకున్నారు.  

ఆరు వారాల తర్వాత హౌస్ మేట్స్‌కు తొలిసారిగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. ఈ ఫోన్ కార్యక్రమం ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. తొలుత కౌశల్‌కు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వచ్చింది. పిల్లలతో మాట్లాడిన అనంతరం ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. కౌశల్ భార్య మాట్లాడుతూ హౌస్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తర్వాత రోల్ రైడా, దీప్తి సునయన, సామ్రాట్ మాట్లాడారు. నేడు మిగతా వారు కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఫోన్ మాట్లాడిన తర్వాత అందరూ హ్యపీగా గడపడం కనినిపించింది. ముఖ్యంగా కౌశల్ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.
Bigboss
Star Maa
kaushal
Deepti
pooja ramachandran

More Telugu News