వరుస సినిమాలతో రాజశేఖర్ కూతురు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస సినిమాలతో రాజశేఖర్ కూతురు!

  • తెలుగులో '2 స్టేట్స్' రీమేక్ 
  • తమిళంలో విష్ణు విశాల్ జోడీగా 
  • మలయాళంలో ప్రణవ్ సరసన    
రాజశేఖర్ కూతురు శివాని కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. హిందీలో ఘన విజయాన్ని సాధించిన '2 స్టేట్స్' సినిమా తెలుగు రీమేక్ లో ఆమె నటిస్తోంది. తెలుగు సినిమాలో మాత్రమే కాదు .. తమిళ .. మలయాళ భాషల్లోను ఆమె ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో విష్ణు విశాల్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. వీవీ స్టూడియోస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం 'మధురై'లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకటేశ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దీనిని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మలయాళంలో మోహన్ లాల్ కుమారుడు 'ప్రణవ్' జోడీగా కూడా శివాని నటించనుందనే వార్త వినిపిస్తోంది. మొత్తానికి శివాని ఒకేసారి మూడు భాషల్లోను ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందన్న మాట.   
shivani
vishnu vishal

More Telugu News