రాజ్యసభలో అవిశ్వాసంపై చర్చను వాయిదా వేసిన వెంకయ్యనాయుడు
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజన సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీలు నోటీసులు ఇచ్చాయి. సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభ్య ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని తెలిపారు.
అయితే, చర్చను మాత్రం రేపు చేపడదామని చెప్పారు. సభ్యుల అభ్యర్థన మేరకే చర్చను వాయిదా వేశామని తెలిపారు. మరోవైపు పార్లమెంటు ప్రాంగణం వద్ద టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే, చర్చను మాత్రం రేపు చేపడదామని చెప్పారు. సభ్యుల అభ్యర్థన మేరకే చర్చను వాయిదా వేశామని తెలిపారు. మరోవైపు పార్లమెంటు ప్రాంగణం వద్ద టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.