మనుషులు వాడే భాషేనా అది?.. నెటిజన్లపై నటుడు నాని ఫైర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనుషులు వాడే భాషేనా అది?.. నెటిజన్లపై నటుడు నాని ఫైర్!

  • నెటిజన్ల తీరు బాగలేదంటూ ఆగ్రహం
  • జుగుప్సాకరమైన భాష వాడొద్దంటూ హితవు
  • హౌస్‌లో సందడి చేసిన మంచు లక్ష్మి
బిగ్‌బాస్ హోస్ట్ నాని నెటిజన్లపై ఫైరయ్యాడు. బిగ్‌బాస్ ఇంటి సభ్యులపై నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హౌస్‌లోని అందరూ.. అందరికీ నచ్చాలనేమీ లేదని, ఆ విషయాన్ని చెప్పొచ్చని, కానీ అసభ్యపదజాలంతో కామెంట్స్ చేయడం సరికాదని అన్నాడు. తేజస్వి విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధగా ఉందన్నాడు. బయట ఇలాంటి మనుషులు ఉన్నారా? అని అనిపిస్తోందన్నాడు. కామెంట్స్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లో మంచు లక్ష్మి సందడి చేసింది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన ఆమె హౌస్‌మేట్స్ తో కలిసి కాసేపు సందడి చేసింది. లక్ష్మి కోసం రోల్‌రైడా ఓ పాట పాడాడు. గణేశ్ ఆర్జేగా అవతారమెత్తాడు. కాగా, ఈసారి నానికి బదులు మంచు లక్ష్మి ఎలిమినేషన్‌ను ప్రకటించింది. తేజస్వీ పేరు ప్రకటించగానే హౌస్‌లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామ్రాట్‌కు నోటమాట రాలేదు. షో చివరి వరకు మూడీగానే ఉన్నాడు. ఇక, తేజస్వీ వెళ్తూవెళ్తూ బిగ్‌బాంబ్‌ను గణేశ్‌పై విసిరింది. బిగ్‌బాంబ్‌లో భాగంగా గణేశ్ ఈ వారమంతా పాలసీసాతో నీళ్లు తాగాల్సి ఉంటుంది.
Bigboss
Actor
Nani
Tollywood

More Telugu News