మళ్లీ లీకైంది... బిగ్ బాస్ నుంచి నేడు తేజస్వి ఎలిమినేషన్!

  • తేజస్వి బయటకు వచ్చేసినట్టు పోస్టు 
  • షోలో ప్రేక్షకులుగా ఉన్న వారి ద్వారా లీక్
  • ఒక రోజు ముందే షూట్ చేస్తున్న స్టార్ మా
టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 ఎలిమినేషన్ ఫలితం మరోమారు లీకైంది. నేడు తేజస్వి ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చేశాయి. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ రియాల్టీ షోలో ఎలిమినేషన్ ఎపిసోడ్ ను ఒకరోజు ముందే స్టార్ మా సిబ్బంది షూట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ప్రేక్షకులుగా చాలా మంది యువతీ యువకులు కూర్చుని ఉంటారు. వారి ముందు నిలబడి నాని వ్యాఖ్యాతగా ఎలిమినేషన్ ను నడిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ షూట్ అయిపోగానే బయటకు వచ్చే ప్రేక్షకుల్లో కొందరు ఎలిమినేషన్ పై పోస్టులు పెడుతున్నారు. నేడు తేజస్వి హౌస్ నుంచి బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి చాలా మంది టీవీ ప్రేక్షకులు సైతం తేజస్వీయే ఎలిమినేట్ అవుతుందని ముందుగానే ఊహిస్తున్నారు.
Go Back to Shorts
Star Maa
Biggboss
Tejaswi
Elemination

More Telugu News