కూతురు సితార బర్త్ డే కోసం మహేష్ తయారు చేయించిన స్పెషల్ కేక్... హ్యాపీగా వేడుకలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూతురు సితార బర్త్ డే కోసం మహేష్ తయారు చేయించిన స్పెషల్ కేక్... హ్యాపీగా వేడుకలు!

  • ఓ హోటల్ లో సితార ఆరో బర్త్ డే
  • ఫ్యామిలీ ఫొటోతో కేక్
  • అభిమానులతో పంచుకున్న మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతల లైఫ్ లోకి సితార వచ్చి అప్పుడే ఆరేళ్లు అయిపోయాయి. ఆరేళ్లు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ, సితార పుట్టిన రోజు వేడుకలను ఓ స్టార్ హోటల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఇందుకోసం తమ ఫ్యామిలీ ఫొటోతో తయారైన కేక్ ను ప్రత్యేకంగా చేయించాడు. తన లిటిల్ ప్రిన్సెస్ సితార ఆరో పుట్టిన రోజు వేడుకలంటూ కొన్ని ఫొటోలను మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు. కాబోయే సూపర్ స్టార్ గా ప్రిన్స్ అభిమానులు భావించే గౌతమ్ కూడా ఈ చిత్రాల్లో ఉన్నాడు. ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు.
Mahesh Babu
Namrata
Sitara
Birthday

More Telugu News