తనపై మండిపడ్డ ఓ నెటిజన్ కు క్లాస్ పీకిన యాంకర్ అనసూయ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనపై మండిపడ్డ ఓ నెటిజన్ కు క్లాస్ పీకిన యాంకర్ అనసూయ!

  • అనసూయ పోస్ట్ చేసిన వీడియోపై  నెటిజన్ల  స్పందన
  • కారు డ్రైవర్ కు మద్దతుగా నిలిచిన ఓ నెటిజన్
  • ఆ నెటిజన్ కు క్లాస్ పీకుతూ బదులిచ్చిన అనసూయ
చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న ఓ యువకుడు, తనకు ఎదురుగా ఉన్న స్మార్ట్ ఫోన్ లో వీడియోను చూస్తూ కారు నడుపుతుండగా ఓ వీడియో తీసిన యాంకర్ అనసూయ,ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం తెలిసిందే. ఇలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు అతిక్రమించే వారిని కఠినంగా శిక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేయడంపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ఆ డ్రైవర్ ను వెనకేసుకొస్తూ అనసూయపై ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘అనసూయ గారు, మీరు ఫిర్యాదు చేయడం మంచి పనే అనుకుందాం. కానీ, ఒక్క నిమిషం మీ ఆడి క్యూ 7 కారు విండో దించి అతడికి చెప్పొచ్చుగా. మీరు ఇప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే అతనికి ఆదాయం ఎలా వస్తుంది?' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. 

ఇందుకు అనసూయ స్పందిస్తూ, ‘మీ నోర్లు చాలా ఈజీగా మాపై జారుస్తారు.. ఇన్ని చెప్పినా మీకు నిజానిజాలు తెలుసుకోవాలనే ఇంగితం లేకపోవడం గమనార్హం. నేను కూడా కష్టపడే సంపాదిస్తున్నానండి. నా ఫ్యామిలీ కోసమే మా కష్టం, మా పని. మా ఫ్యామిలీస్ పై ఎందుకండి అంత చులకనా?  మా గురించి ఇష్టమొచ్చింది రాసేటప్పుడు, యూట్యూబ్ లో పెట్టేటప్పుడు..ఇష్టమొచ్చినట్టు ఇలా కామెంట్స్ పెట్టేటప్పుడు మా పని గురించి, మా సంపాదన గురించి, మా కుటుంబాల గురించి మీరు ఆలోచించరే?  మా ఫేమ్ పోయి, మా పని పోతే మీ అందరిలా మామూలు ఉద్యోగాలు కూడా చేసుకోలేమండి.. ఇది తెలియదా మీకు?’ అని ఆ నెటిజన్ కు అనసూయ క్లాస్ పీకింది. 
anchor anasuya
netizens

More Telugu News