కల్యాణ్ దేవ్ తో సినిమాపై స్పందించిన హరీశ్ శంకర్
- మెగా హీరోలతో చేసిన హరీశ్ శంకర్
- కల్యాణదేవ్ తో నెక్స్ట్ మూవీ అంటూ టాక్
- 'దాగుడుమూతలు' ఇప్పట్లో లేనట్టే
గతంలో పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ లతో హరీశ్ శంకర్ సినిమాలు చేశాడు. అందువలన కల్యాణ్ దేవ్ తో చేయడం కూడా నిజమే కావొచ్చని అనుకున్నారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తాజాగా హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో హరీశ్ చేద్దామనుకున్న 'దాగుడుమూతలు' కూడా ఈ ఏడాది పట్టాలెక్కడం లేదు .. ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏమిటనేది చూడాలి మరి.