స్వామి అగ్నివేష్ ఒక ద్రోహి: జార్ఖండ్ మంత్రి

  • అగ్నివేష్ ది స్వయం ప్రేరేపిత దాడి
  • ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నారు
  • కశ్మీర్ వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంటారు
ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై జార్ఖండ్ లో బీజేవైఎం కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సబంధించి జార్ఖండ్ రాష్ట్ర మంత్రి సీపీ సింగ్ కొత్త భాష్యం చెప్పారు. అగ్నివేష్ పై ఎవరూ దాడి చేయలేదని... ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పారు. ఇది ముమ్మాటికీ స్వయం ప్రేరేపిత దాడి అని అన్నారు. అగ్నివేష్ ఓ ద్రోహి అంటూ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని, కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంటారని అన్నారు. సీపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Go Back to Shorts
swamy agnivesh
attack
cp singh

More Telugu News