ఏడుస్తున్న ఆటగాడి కన్నీళ్లు తుడిచిన క్రొయేషియా అధ్యక్షురాలు!

  • ఫ్రాన్స్ చేతిలో ఓడిన క్రొయేషియా
  • కన్నీరు పెట్టుకున్న క్రొయేషియా కెప్టెన్
  • కన్నీళ్లు తుడిచి ఓదార్చిన అధ్యక్షురాలు
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో క్రొయేషియా ఓడిపోయింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హృదయాలను ఆ జట్టు ఆటగాళ్లు గెలుచుకున్నారు. ఫైనల్లో ఓటమిని తట్టుకోలేని క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన ఆ దేశాధ్యక్షురాలు కొలిండా గ్రాబర్-కిటారోవిక్ అతడి దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడిచారు. బాధపడొద్దని ఓదార్చారు.

 బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, క్రొయేషియా అధ్యక్షురాలు కలిసి క్రొయేషియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమును సందర్శించారు. ఇక, ఫైనల్లో ఓడి స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు దేశం మొత్తం ఘనస్వాగతం పలికింది. దేశ ప్రజలందరూ దాదాపు బయటకు వచ్చి స్వాగతం పలికారు.
Go Back to Shorts
croatia
FIFA
France

More Telugu News