బాలీవుడ్ డైరెక్టర్ తో బన్నీ చర్చలు?
- కథ రెడీ చేస్తోన్న విక్రమ్ కుమార్
- త్వరలోనే రంగంలోకి త్రివిక్రమ్
- బన్నీ కొత్త ఆలోచన
'సరైనోడు' హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అందువలన బన్నీ ఒక హిందీ సినిమా చేయబోతున్నాడని కొందరు చెబుతుంటే .. బాలీవుడ్ డైరెక్టర్ తో తెలుగు సినిమానే చేయనున్నాడని మరికొంతమంది అంటున్నారు. ఈ విషయంలోనే క్లారిటీ రావలసి వుంది. ఇటు విక్రమ్ కుమార్ తో చేసినా .. అటు బాలీవుడ్ డైరెక్టర్ తో చేసినా, ఒక వైపున త్రివిక్రమ్ తో ప్రాజెక్టును నడిపిస్తూనే ఉండాలనేది బన్నీ ఉద్దేశంగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.