హైదరాబాద్‌లో దారుణం: పిలిస్తే పలకలేదని యువకుడిని పొడిచి చంపేశారు

16-07-2018 Mon 08:45 | Telangana
  • స్పందించనందుకు స్నేహితుల మధ్య వాగ్వాదం
  • కత్తితో పొడిచిన మరో యువకుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
పిలిస్తే పలకలేదన్న అతి చిన్న కారణంతో స్నేహితుడినే పొట్టనపెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మంగళహాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణం అందరినీ నివ్వెర పరుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిర్రా కిషన్‌నగర్‌కు చెందిన జాఫర్ కుమారుడు మహమ్మద్ ఇసా (22) పండ్ల వ్యాపారి. శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇసాను అతడి స్నేహితుడు మాజిద్ పని ఉందని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో బైక్‌పై వెళ్తున్న ఇసాను చూసిన అతడి స్నేహితులు మహమూద్, ముస్తాపాలు పిలిచారు. వారి పిలుపు వినిపించకపోవడంతో ఇసా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. రాత్రి 11:30 గంటలకు ఇసా తిరిగి వస్తున్నప్పుడు అక్కడే కాపుకాసిన స్నేహితులు మరోమారు పిలిచారు. దీంతో వారి వద్దకు వెళ్లిన ఇసాతో గొడవకు దిగారు. పిలిచినా పట్టించుకోకుండా ఎందుకు వెళ్లిపోయావని నిలదీశారు.

 ఈ క్రమంలో ఇసా, మహమూద్‌ల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన మహమూద్ కత్తితో ఇసాపై దాడిచేశాడు. చాతిపై కత్తిపోట్లు తగలడంతో ఇసా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇసాను ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
HyderabadKnifeattackdead

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more