కత్తి మహేశ్, పరిపూర్ణానందలపై బహిష్కరణను సమర్థించుకున్న కేసీఆర్
- శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటాం
- అందుకే వారిని నగరం నుంచి బహిష్కరించాం
- గవర్నర్‌తో భేటీలో కేసీఆర్
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ బీజేపీ నేతలు శనివారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం నరసింహన్‌తో సీఎం భేటీ అయ్యారు. పలు విషయాలను వివరించారు. సంచార జాతులను బీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదన ఉందని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల రద్దు, హైకోర్టులో ధిక్కార పిటిషన్, పార్లమెంటు సమావేశాలు, ముందస్తు ఎన్నికలు వంటి విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.