ట్విట్టర్‌లో ఫాలోవర్లను భారీగా కోల్పోతోన్న రాజకీయ, సినీ ప్రముఖులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్‌లో ఫాలోవర్లను భారీగా కోల్పోతోన్న రాజకీయ, సినీ ప్రముఖులు

  • తగ్గిపోయిన ట్రంప్‌, మోదీల ఫాలోవర్లు
  • షారుక్‌, అమితాబ్‌‌, సల్మాన్‌‌, మహేశ్‌ బాబు పరిస్థితీ అంతే
  • ఫేక్‌ ఖాతాలను ట్విట్టర్‌ తొలగించడమే కారణం
కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ మధ్య భారీగా ట్విట్టర్‌ ఫాలోవర్లను కోల్పోతున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ ఇటీవల 43.4 మిలియన్లు ఉండగా కొన్ని రోజుల్లోనే 43.1 మిలియన్‌కు దిగజారింది. అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా భారీగా ఫాలోవర్లను కోల్పోయారు.

ఫేక్‌ ఖాతాలను ట్విట్టర్‌ శాశ్వతంగా తొలగిస్తుండడంతో వారు ఫాలోవర్లను కోల్పోతున్నట్లు తెలిసింది. భారీగా సెలబ్రిటీలను కోల్పోతోన్న సెలబ్రిటీల్లో సినీనటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, మహేశ్‌ బాబు ఉన్నారు. తమ స్పామ్‌ విధానాలకు విరుద్ధంగా ఉన్న అకౌంట్లను డిలీట్‌ చేస్తున్నామని ట్విట్టర్‌  ప్రతినిధులు తెలిపారు.
Twitter
Narendra Modi
Mahesh Babu

More Telugu News