అమెరికాలో షూటింగ్ .. శ్రీను వైట్ల పిల్లలతో ఇలియానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో షూటింగ్ .. శ్రీను వైట్ల పిల్లలతో ఇలియానా

  • అమెరికాలో 'అమర్ అక్బర్ ఆంటోని'
  • దర్శకుడిగా శ్రీనువైట్ల 
  • రవితేజ సరసన నాయికగా ఇలియానా  
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఇలియానా జాయిన్ అయింది. రవితేజ .. ఇలియానా కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగు కోసం శ్రీను వైట్ల ఎక్కువ కాలం అక్కడే వుండవలసి రావడంతో, ఆయన శ్రీమతి రూప వైట్లతో పాటు పిల్లలు కూడా అక్కడికి వెళ్లారు. షూటింగులో జాయిన్ అయిన ఇలియానాకి స్పెషల్ గా వాళ్లు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రేమానురాగాలకు ఇలియానా మురిసిపోతూ థ్యాంక్స్ చెప్పింది. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటు రవితేజ .. శ్రీను వైట్ల కాంబినేషన్ కి, అటు రవితేజ .. ఇలియానా కాంబినేషన్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.  
ileana
raviteja

More Telugu News